Breaking News

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం

-జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పదిసూత్రాలపై చర్చ
-ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
-సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్సు లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడలో ఘనంగా ముగిసిన ‘ఆంధ్రనాట్య సంగమం’ – నవ జనార్ధన పారిజాత నృత్య ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గవర్నర్‌పేటలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘స్వరనర్తన’ సంగీత నృత్య శిక్షణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *