-విద్యాసాగర్, డి.వి. రమణ
-నామినేషన్ల మహోత్సవ సంబరం…
-వెల్లువెత్తిన అభిమాన జనసంద్రం…
-భారీ ఊరేగింపుతో…ఉద్యోగుల ఆనందోత్సాహాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్య దక్షత కలిగిన నాయకుడు తమకు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలుగిత్తి చాటిన అరుదైన సందర్భం ఇది. ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గంలోని వివిధ పదవుల భర్తీ కోసం నేడు జరిగిన ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డివి రమణలు నామినేషన్ల కార్యక్రమం యావత్తు ఉద్యోగుల ఆనందోత్సాహాల మధ్య విజయవాడ నగరంలోని పాత బస్టాండ్ ప్రాంగణం నుంచి గాంధీనగర్ లోని రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీతో ఎపి ఎన్జిజీవో సంఘం వర్ధిల్లాలి అనే నినాదాలతో కోలాహలంగా కిలోమీటర్ పొడవునా జన సందోహంతో జెండాలు చేతబట్టిన ‘సాగర’ సైన్యం కదం తొక్కింది. కొంతమంది మహిళా ఉద్యోగులు దారి పొడవునా ఆనంద నృత్యాలు చేస్తూ విద్యాసాగర్ బృందానికి స్వాగతం పలికారు. వారి ఉత్సాహం చూసిన నాయకుడు సైతం వారితో జత కలిపి వారితో కలిసి నర్తించారు. తలపెట్టిన పనిలో విజయం సాధించేంత వరకు విశ్రమించని నాయకుడిని అభినందించేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి తరలి వచ్చిన వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో ఊరేగింపు అపూర్వంగా గతంలో మున్నెన్నడూ లేని రీతిలో అద్వితీయంగా… తమ అభిమాన నాయకుడిని ఎన్నుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ తమ మద్దతు తెలియజేసేందుకు వచ్చిన ఉద్యోగులకు అధ్యక్ష, కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ ప్రక్రియకు ముందు వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని వివిధ రూపాల్లో సాధించామన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు తమ కార్యవర్గ బృందాన్ని మరొకసారి ఆశీర్వదించాలని ఉద్యోగులను కోరుతున్నామన్నారు. చేపట్టిన పనిలో విజయం సాధించేంతవరకు విశ్రమించకుండా నిరంతరం ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా గత రెండేళ్లలో తాము పనిచేసి చూపించామన్నారు. తాము తలపెట్టిన కొన్ని కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్న క్రమంలో మరొకసారి తన బృందం ఏకగ్రీవంగా ఎన్నికవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు. తనపై నమ్మకంతో తరలివచ్చిన మంది ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తన పనితీరు ఉంటుందన్నారు. ఇప్పటివరకు తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. రానున్న రోజుల్లో మరింత నిబద్ధతతో ఉద్యోగులకు మేలు చేసే మరిన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఉంటాయని హామీ ఇస్తున్నానన్నారు.
Prajavartha Online Telugu News