Breaking News

అంగన్వాడీ సిబ్బందిసంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే
-అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
-అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు
-ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను పరిష్కరించాం..హోం మంత్రి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికీ, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీననే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్‌ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
కూటమి పాలనలో అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70 నుండి 96 శాతానికి పెరిగిందని ఆమె తెలిపారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని, 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే గ్రాట్యుటీ చెల్లింపులకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, ఆర్‌వో యంత్రాలు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజుల సెలవులు మంజూరు చేసినట్లు చెప్పారు. చిన్నారుల అభివృద్ధికి ఆటవస్తువులు, పాఠ్య చార్టులు, ఇండక్షన్ స్టవ్‌లు, నాణ్యమైన వంట పాత్రలు అందజేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి కల్పించి పూర్తి స్థాయి వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. అదనంగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి వెళ్లిందని ఆరోపించిన మంత్రి, వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు మరిన్ని అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. అయినప్పటికీ ప్రతి నెల ఒకటో తేదీననే వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వమేనని హోంమంత్రి అనిత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *