Breaking News

కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

-అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వమే సంరక్షకుల మాదిరి ప్రత్యేక చొరవతో వైద్యం అందిస్తోంది
-వసతి గృహాల్లో బాలికల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం
-రాత్రిపూట హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ద్వారా గస్తీ ఏర్పాటు చేశాం
-24 గంటలు నిఘా ఉండేలా హాస్టళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో భద్రత, సౌకర్యాలపై గురువారం శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి డిఎస్ బీవీ స్వామి సమాధానం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డా.బి. ఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో లక్షా 4 వేలమంది విద్యార్థులు ఉన్నారు. రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం 52 వేల పడకలు కావాల్సి ఉంది, దశలవారీగా మంచాలు సమకూర్చే విషయం పరిశీలిస్తున్నాం. వసతిగృహాల్లో 96,159 మంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు 700 మాత్రమే ఉన్నాయి. 95,459 మంచాలు అవసరం. పాత భవనాలు కాబట్టి మంచాలు ఉంచే వెసులుబాటు లేదు, అధ్యయనం చేసి మంచాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు మంచాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. విశాఖ జిల్లా గాజువాక, పెందుర్తిలో నూతన హాస్టల్ బిల్డింగులు మంజూరు చేస్తాం. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అదనపు మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. కూటమి పాలనలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వమే సంరక్షకుల మాదిరిగా ప్రత్యేక చొరవతో వైద్యం అందిస్తోంది. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, అంబేడ్కర్ గురుకులాల్లో అనారోగ్యానికి గురైన 36 మంది విద్యార్థులకు ప్రత్యేక చొరవతో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాం. శ్రీకాకుళం జిల్లా కొల్లివలస అంబేద్కర్ గురుకుల విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురైతే రూ. 16 లక్షలతో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాం. థైరాయిడ్ కి గురైన 80 మంది, మూర్చ వ్యాధి ఉన్న 54 మంది, అపెండిక్స్ విద్యార్థులు 45 మందిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. క్యాన్సర్ బారిన పడిన నలుగురు విద్యార్థులకు చికిత్స వైద్యం అందించి ప్రాణాలు కాపాడాం. సమర్థవంతమైన స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో రక్తహీనతతో పాటు పలు వ్యాధులను గుర్తిస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్య అవసరాల కోసం 24 గం.లు అందుబాటులో ఉండేలా స్టాఫ్ నర్సులను నియమించాం. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక వైద్య అధికారిని నియమించాం. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. సాంత్వన ద్వారా విద్యార్థుల అత్యవసర ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. పరిశుభ్రత ఆహారం కోసం స్టాండర్డ్ ప్రొసీజర్స్ జారీ చేశాం. వసతి గృహాల్లో బాలికల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా అధికారులు వసతి గృహాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. రాత్రిపూట హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ద్వారా గస్తీ ఏర్పాటు చేశాం. 24 గంటలు నిఘా ఉండేలా హాస్టళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. NGO లు, మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో పని చేస్తూ పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పన, బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్నాని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *