-సెక్రటరీ జనరల్ టు లెజిస్లేచర్ సూర్యదేవర ప్రసన్నకుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చెందిన ‘షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ’ (Committee on Welfare of Scheduled Tribes) సమావేశం మార్చి 25వ తేదీ, బుధవారం ఉదయం 11:00 గంటలకు, వెలగపూడి అమరావతిలోని అసెంబ్లీ భవన్ లో గల కమిటీ హాల్ నెం.1లో జరగనుందని సెక్రటరీ జనరల్ టు లెజిస్లేచర్ సూర్యదేవర ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారని సెక్రటరీ జనరల్ టు లెజిస్లేచర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News