Breaking News

అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రత్యేక శ్రద్ధ

-పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో మంత్రి వరుస వీడియో కాన్ఫరెన్స్ లు
-తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో అంబేద్కర్ గురుకులాల 10 వ తరగతి విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి
-టీచర్, పేరెంట్ లా విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేసిన మంత్రి డా.స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో వరుస వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి టీచర్, సొంత పేరెంట్ లా మంత్రి విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేస్తున్నారు. మంగళవారం తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో అంబేద్కర్ గురుకులాల 10 వ తరగతి విద్యార్థులతో మంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. 100 శాతం విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలని, కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థులు కొద్దిపాటి అనారోగ్యానికి గురైనా నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలన్నారు. విద్యార్థులను బస్సులో పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లి తిరిగి హాస్టళ్లకు చేర్చే వరకు పర్యవేక్షించాలన్నారు. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందన్నారు.
పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

AP SWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ… విద్యార్థులు ఆందోళన లేకుండా ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. పాత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేయడంతో పాటు గుర్తుండేలా నోట్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తాను 10 తరగతి పరీక్షలు రాసిన అనుభవాన్ని విద్యార్థులతో ఆయన పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో AP SWREIS అదనపు కార్యదర్శి రాజ్యలక్ష్మి, జాయింట్ సెక్రటరీ రూపావతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *