Breaking News

చంద్రబాబు నిరంతర కృషి ఫలితం… సంక్షోభంలోనూ తెలుగు వారిని కాపాడిన కూటమి ప్రభుత్వం

-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాట ఇచ్చామంటే చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. హామీల అమలు విషయంలోనైనా, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడపడంలోనైనా మరెవరికి సాధ్యం కాని విధంగా ముఖ్యమంత్రి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. అలుపెరుగని యోధుడిలా నిరంతరం శ్రమిస్తూ, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో బహ్రెయిన్ ప్రాంతంలో కూడా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో అక్కడికి పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మొత్తం 63 మంది ఏపీ వాసులు ప్రాణభయంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించగా, పరిస్థితి తీవ్రతను వెంటనే గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆదేశించినట్లు పల్లా తెలిపారు.

విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయిన 59 మంది పర్యాటకులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టిందన్నారు. బహ్రెయిన్ నుంచి నేరుగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో వారిని రోడ్డు మార్గంలో సౌదీ అరేబియాకు తరలించి, అక్కడి నుంచి భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యుద్ధ వాతావరణంలోనూ వేగవంతమైన సమన్వయంతో ఈ కార్యాచరణ విజయవంతంగా అమలైందన్నారు.

ఈ చర్యల ఫలితంగా చిక్కుకుపోయిన పర్యాటకులు సురక్షితంగా సౌదీ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలించబడ్డారని పల్లా తెలిపారు. అనంతరం వారు స్వదేశానికి చేరుకుని తమ తమ ప్రాంతాలకు ప్రయాణమయ్యారని పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో 130 మంది బహ్రెయిన్ నుంచి రోడ్డు మార్గంలో సౌదీ చేరుకుని అక్కడి నుంచి ముంబై విమానాశ్రయానికి ప్రయాణమయ్యారని, వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. అమెరికా, యూరప్ నుంచి ప్రయాణిస్తూ ఖతార్, దుబాయ్‌లలో ట్రాన్సిట్‌లో చిక్కుకున్న పలువురు కూడా తిరిగి భారత్‌కు చేరుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

పరిస్థితులపై నిరంతర సమీక్ష

గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ద్వారా గల్ఫ్ దేశాల కోఆర్డినేటర్లతో ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామని పల్లా తెలిపారు. విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలకు సహాయం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కూడా ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తూ సహాయం కోరుతున్నారని పేర్కొన్నారు.

అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, విదేశాల్లో చిక్కుకున్న ప్రజలకు అందుబాటులో ఉండి, సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నిరంతరం సమాచారం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

తెలుగు వారిపై బాధ్యతతో స్పందించిన ప్రభుత్వం

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలకు అండగా నిలబడే నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనని పల్లా అన్నారు. ఎలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనైనా తమ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వం ఆయనదేనని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ, కష్టకాలంలో కూడా అండగా నిలబడే పట్టుదలతో పనిచేస్తున్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిదేనన్నారు.

ఈ ఘటన కూటమి ప్రభుత్వ నిబద్ధతకు, ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారికి అండగా నిలబడే ప్రభుత్వం ఇదేనని, సంక్షోభ సమయంలో కూడా ప్రజల భద్రతే ముఖ్యమనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మృతి చెందిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్షన్ లే తొలగించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ లో కేటాయించిన నిధులకు అదనంగా బేవరేజెస్ కార్పొరేషన్ నిధుల నుండి రూ. 11,140.46 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *