-వివిధ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఉపరాష్ట్రపతికి వివరించిన బృందం
-వివిధ సమస్యల ప్రస్తావన నేపథ్యంలో సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఉపరాష్ట్రపతి
-ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు చొరవ తీసుకోవాలని సూచన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) బృందం కలిసింది. ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుతం సేవలు అందిస్తున్న తీరును ఉపరాష్ట్రపతికి వివరించారు. అయితే నీటి లభ్యత, నిర్మాణ విస్తరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ సమస్యలను ఎయిమ్స్ బృందం ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ సంచాలకులు ప్రొ (డా) ముఖేష్ త్రిపాఠి, డీన్ ప్రొ(డా) జోయ్ ఏ ఘోషల్, డిప్యూటీ డైరక్టర్ అనుష్మాన్ గుప్త, అసిస్టెంట్ ప్రొఫెస్ డా. కె.వంశీ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి , ఆసుపత్రి నిర్వహణ సిబ్బంధి తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.