అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు. భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుంది. మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటాము. భారతీయ సంస్కృతిలోని సత్యం, ధర్మం, న్యాయం, దయ, కరుణల మూర్తిత్వమే శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుడి జీవిత ఆదర్శాల స్ఫూర్తితో, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయం. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా దీపావళి పండగ విశిష్టత. మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు శ్రీరామచంద్రుడి అయోధ్య ఆగమనం, లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం జరుపుకునే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని తీసుకురావాలని, సరికొత్త ముందడుగుకు మార్గదర్శనం చేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ… శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలియజేశారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …