Breaking News

మహవీర్ ఆటోడయాగ్నోస్టిక్స్ తో కలిసి నూతన డీలర్ షిప్ సదుపాయం ప్రారంభించిన స్కోడా ఆటో… 


-సికింద్రాబాద్ లో అత్యాధునిక సేల్స్ బ్రాంచ్ షో రూమ్, మహవీర్ ఆటోను ప్రారంభించిన స్కోడా ఆటో; 222 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ అత్యాధునిక షోరూమ్
-ఇండియా 2.0 ప్రాజెక్ట్ క్రింద 100కు పైగా నగరాలలో అమ్మకాలు మరియు అమ్మకపు తరువాత సేవలతో సహా స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు 170కు పైగా కస్టమర్ టచ్ పాయింట్లతో చేరుకోనుంది; రాబోయే సంవత్సరానికి 225 టచ్ పాయింట్లను అధిగమించనుంది

సికింద్రాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త :
స్కోడా ఆటో ఇండియా తమ అత్యాధునిక డీలర్ షిప్ ను సికింద్రాబాద్ లో మహవీర్ ఆటోడయాగ్నోస్టిక్స్ పేరిట బోయినపల్లి వద్ద ప్రారంభించింది. ఈ నూతన సదుపాయంతో స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు సికింద్రాబాద్ లో తమ ఉనికిని విస్తరించడంతో పాటుగా నగరంలో మరింత విస్తృ తంగా తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ డీలర్ షిప్  సదుపాయంలో అత్యాధునిక కార్పోరేట్ గుర్తింపుతో పాటుగా స్కోడా ఆటో డిజైన్ భాష కూడా కనిపిస్తుంది. చెక్ ఆటో తయారీదారు, తమ ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద రాబోయే సంవత్సరానికి 225 టచ్ పాయింట్లకు తమ ఉనికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహవీర్ ఆటో డయాగ్నోస్టిక్స్ వ్యూహాత్మకంగా బోయినపల్లి ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వినియోగదారుల అవసరాలను తీర్చనుంది. దాదాపు 222 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ సదుపాయంలో నాలుగు కార్లను సౌకర్యవంతంగా ప్రదర్శించనున్నారు. ఈ నూతన కేంద్ర ప్రారంభం గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జక్ హోల్లిస్ మాట్లాడుతూ “కుషాక్ ఆవిష్కరణతో, స్కోడా ఆటో ఇండియా అసాధారణ వృద్ధిని నమోదు చేస్తుంది. ఇండియా 2.0 వ్యూహంలో ఇది మొదటి దశ. మా తరువాత ఉత్పత్తి ‘స్లావియా’ మరో మారు గేమ్ ఛేంజర్ గా ‘కుషాక్’తో పాటుగా నిలువడంతో పాటుగా 2022 నాటికి మా అమ్మకాలను రెట్టింపు చేసుకోవడంలో తోడ్పడనుంది. శక్తివంతమైన ఉత్పత్తి జాబితాతో స్కోడా బ్రాండ్ ను నూతన మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లుకు భారతదేశ వ్యాప్తంగా విస్తరించనున్నాం. దీనితో పాటుగా యాజమాన్య అనుభవాలను విస్తరించడమనేది మా వృద్ధి వ్యూహంలో అత్యంత కీలకం మరియు మా నెట్వర్క్ ఉనికిని విస్తరించడమనేది ఈ లక్ష్యం చేరుకోవడంలో కీలకాంశంగానూ ఉంటుంది. సికింద్రాబాద్ లో ఈ నూతన డీలర్షిప్ కేంద్ర ప్రారంభం ఈ ప్రణాళికలో భాగం. మహవీర్ ఆటోడయాగ్నోస్టిక్స్ భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ ప్రాంతంలో మరింతగా విస్తరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. మహవీర్ ఆటోడయాగ్నోస్టిక్స్ డీలర్ ప్రిన్సిపల్ యశ్వంత్ జబక్ మాట్లాడుతూ “స్కోడా ఆటో ఇండియాతో భాగస్వామ్యం చేసుకోవడం తో పాటుగా సికింద్రాబాద్ లో మా నూతన డీలర్షిప్ కేంద్రం ప్రారంభించడం గర్వకారణంగా ఉంది. అత్యాధునిక ఆర్కిటెక్చర్ మరియు క్రమబద్దీకరించబడిన వ్యాపార ప్రక్రియలు స్కోడా ఆటో ఉత్పత్తుల ప్రదర్శనకు అనువైన నేపథ్యాన్ని అందిస్తాయి. స్కోడా ఆటో యొక్క అంతర్జాతీయంగా అత్యుత్తమ వ్యాపార ప్రక్రియలతో పాటుగా స్థానిక వినియోగదారుల ప్రాధాన్యతల పట్ల మా అవగాహన కూడా తోడై మెరుగైన వినియోగదారుల అనుభవాలను అందించనున్నాయి” అని అన్నారు. క్రమబద్ధమైన వ్యాపార ప్రక్రియలతో మరిన్ని డీలర్షిప్ కేంద్రాలు ఇండియా 2.0 ప్రాజెక్ట్ కు అనుగుణంగా కార్పోరేట్ నిర్మాణ శైలి, మెరుగైన పనితీరు కలిగిన ఇంటీరియర్స్, హేతుబద్దీకరించబడిన వ్యాపార ప్రక్రియలతో మొత్తంమ్మీద వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది. డీలర్షిప్ డిజైన్ యొక్క నిర్మాణాత్మక నేపథ్యం స్కోడా ఆటో సిద్ధాంతాన్ని ‘సింప్లీ క్లెవర్ విత్ హ్యూమన్ టచ్’ అనే నినాదంలో వ్యక్తీకరించబడింది. ఈ డీలర్షిప్ యొక్క నిర్మాణ శైలి స్పష్టంగా, అతి సరళమైన ఆకృతులతో ఉండటంతో పాటుగా ఆకట్టుకునే రంగుల నేపథ్యంలో ఉంటుంది. ఆధునిక లైటెనింగ్ నేపథ్యంతో అత్యాధునిక డిజైన్ ఫీచర్లతో ఇది ఉంటుంది. స్కోడా ఆటో డీలర్ షిప్స్ ఎక్స్ టీరియర్స్ స్పష్టంగా , పారదర్శకంగా, ఆధునికంగా ఉండటంతో పాటుగా బ్రాండ్ యొక్క శక్తివంతమైన స్టేట్మెంట్ను పగలు, రాత్రి కూడా అందిస్తుంది. అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్స్, నూతన డిజైన్ ఫీచర్లు, ప్రభావవంతమైన లైటెనింగ్ పరిష్కారాలు, నిర్మాణాత్మక గ్రాఫిక్ అంశాలు, ఆహ్లాదకరమైన ఉడెన్ టోన్స్ స్వాగతించతగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తాజా రంగులు, స్పష్టత, నిష్కాపట్యము, పారదర్శకత వంటివి స్కోడా ఆటో షోరూమ్స్ నూతన ఇంటీరియర్స్ ను ప్రతిబింబిస్తాయి.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *