-ఓ టీ ఎస్ పూర్తి గా స్వచ్ఛందం
ఉండి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓ టి ఎస్ పథకంతో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో రుణాలు తీసుకున్న వారికి రుణ విముక్తి జరుగుతుందని, అయితే ఓ టి ఎస్ అమలుపై ఎటువంటి నిర్బంధము లేదని పూర్తిగా స్వచ్ఛంద మని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం ఉండి మండలం యండగండిలో ఓ టీఎస్ లో 5 వేల 400 రూపాయలు చెల్లించి రుణ విముక్తి పొందిన యవనమండ శ్రీనివాస్ కు రుణ విముక్తి ధ్రువీకరణ పత్రం అందించారు. ఆస్తి పై హక్కు పొందడానికి ప్రస్తుతం ఉన్న ఆస్తి విలువ ప్రకారం 39 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ వేల్యూ చెల్లించవలసి ఉండగా కేవలం పది రూపాయల నామమాత్రపు ఫీజు తో యవనమంద శ్రీనివాస్ కేవలం పది రూపాయల నామమాత్రపు ఫీజు తో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు ఇదేవిధంగా రాష్ట్రంలో ఓ టి ఎస్ చెల్లించిన వారందరికీ రుణ విముక్తి చేయడం జరుగుతుందనీ వివరించారు.రాష్ట్రంలో 39 లక్షల మంది 14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, దీనిపై వడ్డీ చెల్లింపుకు 2014లోనే ఓ టి ఎస్ అమలులోకి తీసుకు వచ్చారని వివరించారు. అయితే, రుణాలు తీసుకున్న వారి నుంచి రుణాలు వడ్డీ కలిపి ఓ టి ఎస్ ప్రకటించాలని విజ్ఞప్తులు రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రజా శ్రేయస్సు కోసం జగనన్న సంపూర్ణ గృహ పథకం ప్రకటించి వన్‌టైమ్ సెటిల్మెంట్ కు అవకాశం ఇచ్చారన్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసం పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చారన్న ప్రతిపక్షాల దుష్ప్రచారం లో లో వాస్తవం లేదన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ వల్ల రుణ విముక్తి కలిగి కుటుంబ అవసరాల నిమిత్తం బ్యాంకుల నుంచి 75 శాతం పైగా రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. అదే విధముగా అత్యవసర పరిస్థితులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునే హక్కు కలుగుతుందన్నారు. దీనికోసం లక్షలు విలువ చేసే ఆస్తి ని సైతం భారీ ఫీజు లేకుండా కేవలం పది రూపాయల నామమాత్రపు ఫీజు తో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్ చేయడం ప్రారంభిస్తారని తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో సుమారు 51 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రజలలో సైతం జగనన్న సంపూర్ణ గృహ పథకం పై మంచి స్పందన ఉందన్నారు. రుణ విముక్తి కావడానికి వన్‌టైమ్ సెటిల్మెంట్ వినియోగించుకుంటున్నారని వివరించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని రుణ విముక్తులు కావాలని కోరారు.