విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల అభ్యున్నతికి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ హెల్త్ సెంటర్ లను ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్, క్రీస్తురాజపురం నందు స్థానిక కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం కలిసి పర్యటించిన ఆయన దాదాపు 10లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన వైయస్సార్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించి అక్కడ ఉన్న సౌకర్యాలు పరిశీలించారు. అదేవిధంగా డివిజన్ లో దాదాపు 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే ఐదు రోడ్లు, వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం లో కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకె సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇదంతా జగన్ నాయకత్వం పటిమ అని కొనియాడారు. కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ లో గతంలో దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా వున్నప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి మెట్ల మార్గాలు, మంచి నీటి సరఫరా కోసం పైప్ లైన్ నిర్మాణాలు చేశారని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో వైసీపీ కార్పొరేటర్ గెలుపొందారు అని కక్ష్య కట్టి స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. మరలా ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి నూతన మెట్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు,మంచినీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వుండే నిరుపేదలు ఆర్థిక కారణాలతో నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదు అని ప్రతి గ్రామంలో వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు పెట్టి అర్హులైన డాక్టర్ లను నియమిస్తున్నారని అది ఈ ప్రభుత్వనికి పేదల పట్ల వారి సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లామ్ కిరణ్, మాజీ కార్పొరేటర్ చిత్రం లోకేష్, వైస్సార్సీపీ నాయకులు, ఒగ్గు విఠల్, శ్రీ లక్ష్మీ, రమేష్, చౌడేష్, రామస్వామి,ముక్కు వెంకటేశ్వర రెడ్డి, కావాటి దామోదర్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags bengulor vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …