విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలను నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల 13,వేల237 గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో ఇప్పటికే లక్షా నలభై వేల గృహాల లెవిలింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు వివరించారు.లేఅవుట్లలో మంజూరైన గృహాలకు లబ్ధిదారుల కోరికమేరకు 10 నుండి 20 మంది లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్/మేస్త్రి ద్వారా గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ లెవిలింగ్ పూర్తయినవి కాకుండా మిగిలిన 74 వేలకుపైగా గృహాలకు అవసరమైన ఆర్థికపరమైన బడ్జెట్ ప్రతిపాదనలను పంపించాలని అజయ్ జైన్ అన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న లక్షా ఎనభై వేల రూపాయల ఆర్థిక సాయం తోపాటు, పొదుపు సంఘాల మహిళలకు 35 వేల నుండి 50 వేల రూపాయల వరకు అదనంగా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అందిస్తున్న నగదును ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసేలా లబ్ధిదారులను చైతన్యపరచాలి అన్నారు. వివిధ దశల్లో నిర్మాణాలకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా గృహ నిర్మాణాల ప్రస్తుత ప్రగతిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సమీక్షించారు. సమీక్ష సమావేశంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ గుప్తా, జాయింట్ కలెక్టర్లు డా.కె. మాధవీ లత,కె. మోహన్ కుమార్, నూపూర్ అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …