Breaking News

మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదు… :  డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి అన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి సుపరిచితురాలు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద కుటుంబాలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు  తీసుకోవడం పై చేతనైనంతలో సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ ఎం పి డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి మాట్లాడుతూ ఇప్పటి విపత్కర పరిస్థితిలో దేవుని దయ వలన, అందరి సమిష్టి కృషి వలన పేదలకు, కరోనా బాధితులకు సేవలందించడంలో చేతనైనంతలో సాయం  చేస్తున్నానన్నారు. వీలైనంతవరకూ ప్రతి వారు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా వారు ఉండాలని, బయటకు అవసరమైతే తప్పితే ఇంటి వద్దే క్షేమంగా ఉంటూ పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు  తీసుకోవడం మంచిదన్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిదన్నారు.. అందుబాటులో వున్నపేదవారికి ఉచితంగా కోవిడ్ మందుల కిట్టు పంపిణీ చేస్తున్నామన్నారు.  మూగ జీవాలను కాపాడాలని, చెట్లను మన వదిలే కార్బన్‌డైయాక్సైడ్‌ పీల్చుకుని ఆక్సిజన్‌ మనకు విడుదల చేస్తున్న ప్రాణ సంజీవిని చెట్లు. అటువంటి వాటిని కాపాడుకుందాం. మనం చెట్లు నాటి భావితరాల వారికి చెట్ల నీడను కల్పిద్దామన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలు సమిష్టి పోరాటంతోనే కరో నా  కట్టడి చేయగలుగుతామని అదే మనందరి ప్రధమ కర్తవ్యమన్నారు.

Check Also

2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు

-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *