Breaking News

ఉప రాష్ట్రపతి మనుమరాలి వివాహ వేడుకకు హాజరైన గవర్నర్…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయం చెంతన ఈ వేడుక జరగగా, వధూవరులు సుష్మ, కిషన్ లను గవర్నర్ ఆశీర్వదించారు. సుష్మ స్వర్ణ భారత్ ట్రస్ట్ ట్రస్టీ దీపా వెంకట్ కుమార్తె కాగా కరోనా నేపథ్యంలో ఎటువంటి హడావిడికి తావు లేకుండా ముఖ్యుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించారు. తరువాత శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ , హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *