తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మూడు సంవత్సరాలు నుంచి అడుగడుగునా దగా చేస్తుందని TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.అమర్తలూరు లో జరిపిన సమావేశంలోగిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలు,విత్తనాలు సరఫరా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తి గా విఫలమైందనిఆరోపించారు. మొక్కజొన్న,పసుపు అరటి,కంద వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని థరల స్థిరీకరణకు కేటాయించిన నిథి ఏమైందని రైతులకు దగ్గర నిలవ ఉన్న థాన్యాన్ని కొనే నాథుడు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని ఒకవేళ కొన్న డబ్బులు రాని పరిస్థితి.గత సీజన్లో కొన్న వాటికి కూడా డబ్బులు రాలేదన్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులకీ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు,గతంలో నాయకులు దళారులుగా తయారు అయి మిల్లర్లతో కలిసి దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1850కి జొన్న కొంటామని చెప్పి కొణకుండా రైతునుండి950 రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని యూరియా,DAPలు RBKల నుండి వైసీపీ నాయకులు దోచుకొంటున్నారన్నారు. కరెంట్ కష్టాలు మొదలు అయ్యాయని కేంద్రానికి తలొగ్గి మీటర్లు బిగింపుకు సమాయత్త మౌతుందన్నారు. రైతుల తరపున వాపక్షాన TDP ఆధ్వర్యంలో పోరాటాన్ని ఎందాకైనా సిద్ధం అని తెలిపారు.
Tags tenali
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …