Breaking News

సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం, అంగన్వాడి కేంద్రం, మధ్యాహ్నం భోజనం ను ఆకస్మికంగా తనిఖీలు …

-ఇంటిని తలపించేలా మధ్యాహ్నం భోజనంఉండాలి, భావి భారత పౌరులుగా విద్యార్థిని,విద్యార్థులను తీర్చి దిద్దాలి ….
-జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ …

ఆకివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం సిబ్బంది ప్రజలకు ,రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ,ఇంటిని తలపించే విధంగా మధ్యాహ్నం భోజనం ఉండాలని ఎక్కడయినా పిర్యాదు వస్తె భాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ హెంచ్చరించారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో శనివారం గ్రామ సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం,అంగన్ వాడి కేంద్రం , మధ్యాహ్నం భోజనం ను, ఐ భీమవరం వాటర్ టాంక్, జాతీయ ఉపాధిహామీ పనులు పరిశీలన చేసి కూలీలతో కలెక్టర్ మాట్లాడారు. సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరి తో మాట్లాడి వారి జాబ్ చార్ట్ , వారు ప్రతిరోజు చేస్తున్న పనులు అడిగి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు, ప్రభుత్వం నిర్దేశించిన సేవలు , పనులు నిర్ణీత సమయంలో గా పూర్తిచేయాలని సమయం దాటిన తర్వాత పరిష్కరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సచివాలయంలో ఉన్న రిజిస్టర్లు ,లబ్ధిదారుల జాబితా, పోస్టర్లు , ఆన్లైన్ యాప్ లను కలెక్టర్ పరిశీలించారు.స్పందన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను డిస్ప్లే బోర్డ్ లో విధిగా ప్రదర్శించాలని తెలిపారు.పోలీస్ కేసులు నమోదు వివరాలను రిజిస్టర్లో నమోదు చేసే అనంతరం పరిష్కారం చేసిన విషయాన్నికూడాపొందుపరచాలని,అలాగే దిశయాప్ మీపరిధిలో వున్న మహిళలు అందరికీ దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని మహిళా పోలీసులకు తెలిపారు.రైతులకు మంచి సేవలు రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందించాలని రైతులతో సిబ్బంది మమేకం అయ్యి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందించాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థిని,విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని ఎక్కడ లోటురాకుండాచూడాలని ,ఇబ్బందులు ఉంటే ముందుగా అధికారులు దృష్టికి తీసుకురావాలని కలెక్టరు అన్నారు. వంట శాల , ఆహార పదార్థాలు పరిశీలించారు.మరుగుదొడ్లు ,పరిసరాలను పరిశీలించి అధికారులకు కలెక్టర్ కొన్ని సూచనలు జారీ చేశారు. వంట పదార్థాలు ఎలా ఉన్నాయి కలెక్టర్ పరిశీలన చేసి ,చిన్నారులతో కలెక్టరు మమేకం అయ్యారు. ఐ భీమవరం వాటర్ టాంక్ పరిశీలించి ఎక్కడ త్రాగు నీరు కొరత రాకుండా రెండు పూటలు పుష్కలంగా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఎక్కడ ఇబ్బందులు వచ్చినా త్వరితగతిని పరిష్కరించాలని, ఇందుకు నిధుల కొరత లేదని కలెక్టర్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించి ఎవ్వరికీ పని కావలసిన పని కల్పించాలని,వారికి నిర్ణీత సమయాల్లో సొమ్ములు చెల్లించాలని ,ఉపాధి హామీ కూలీలతో కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మాజీ టి టి డి చైర్మన్ కనుమూరి. బాపిరాజు, ఉండి నియోజవర్గ ఇన్చార్జి గోకరాజు. రామరాజు, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *