Breaking News

జగనన్న కాలనీల ఇండ్ల నిర్మాణం మరింత వేగవంతం…

-ఐ ఐ యఫ్ యల్ హోమ్ లోను ద్వారా 60 పైసల వడ్డీ రేటు చొప్పున అదనంగా రూ 3 లక్షలు వరకూ ఋణం
-లబ్ధిదారులకు అందించే సువర్ణ అవకాశం
– మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు 
– మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధ రాజు 

పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు 32 లక్షల ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి అంటేనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రాత్మకం అని , ఈ ఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యం అని ఏ పి శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ. శ్రీరంగ నాధ రాజు అన్నారు.

బుధవారం పోడూరు మండలం తూర్పు పాలెం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆచంట నియోజకవర్గ హౌసింగ్ గృహ లబ్ధిదారులకు IIFL హోమ్ లోన్ రుణ మంజూరు పత్రాలు అందచేశారు. బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీ తో అదనంగా మూడు లక్షల రూపాయలు వరకూ ఋణం ఇప్పించే లబ్ధిదారుల అవగాహన సదస్సు ,మంజూరు పత్రాలు లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమంలో మండలి చైర్మన్ , మంత్రి  పాల్గొన్నారు.

@ ఐ ఐ యఫ్ యల్ ద్వారా నూటికి 60 పైసల వడ్డీ కే రూ 3 లక్షలు హౌసింగ్ లోను మంజూరు పత్రాలను చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ,మంత్రి రంగనాథ రాజు లబ్దిదారులకు అందజేశారు.

కొంతమంది లబ్దిదారులు తమకు తక్కువ వడ్డీకి అందజేయడం పట్ల తమ అభిప్రాయాలను సభలో తెలిపి తమ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఇల్లు కట్టారో అంతకంటే ఎక్కువ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజులోనే ఒక్క సంతకం తోనే 32 లక్షలు మంజూరు చేశారని అన్నారు. పేదవానికి సొంతిల్లు కట్టించే మహాభాగ్యం ఆ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కి చెందిన మంత్రి శ్రీరంగనాధ్ కే అవకాశం లభించుట మంచి శుభ పరిణామం అని అన్నారు. లక్షలు ఖరీదైన స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా, రాష్ట్రంలో ఇల్లు నిర్మాణాలు , పేదవాని స్వంత ఇంటిని నిజం చేసుకునేలా ప్రతి అడుగులోను ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారన్నారు. లే అవుట్ల వద్దనే ఇసుకను లబ్దిదారులకి అందచేయ్యడం, ఏ ఒక్క లబ్దిదారుడు ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. సిమెంట్ బస్తాను తక్కువ ధరకు పంపిణి చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్దిదారుడు త్వరితగతిన ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఆయా పనులు పూర్తి చేసుకున్న తర్వాత దశల వారీగా నగదు చెల్లింపులను చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మాటలు నమ్మవద్దని, జగనన్న కల్పిస్తున్న అవకాశంతో స్వంత ఇంటిని పూర్తి చేసుకుని ఇంటి యజమానులు అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం అని మోషేన్ రాజు అన్నారు.

చెరుకువాడ. శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ , ఐ ఐయఫ్ యల్ బ్యాంక్ హోమ్ లోను ద్వారా 60 పైసలకే వడ్డీతో రూ.3 లక్షలు ఋణం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గం నుండి లాంఛనంగా ప్రారంభించామని, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 32 లక్షలు ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని , రాష్ట్రంలో 17500 జగనన్న కాలనీల ద్వారా 17500 క్రొత్త నగరాలు రూపుదిద్దు కుంటున్నాయని మంత్రి తెలిపారు. స్వంత ఇంటికలను నిజం చేసి నిరుపేదలు కళ్ళలో ఆనంద చూసి , వారిని స్వంత ఇంటి యజమానులుగా చూడాలన్నది ముఖ్యమంత్రి కోరిక అన్నారు. ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏన్ని ప్రయోజనాలు సమకూర్చినా కొంత మంది లబ్ధిదారులు బయట అప్పులు తీసుకుని ఇంబ్బందులు పడుతున్నారని గ్రహించి ఐ.ఐ.యఫ్.యల్ హోమ్ లోను ద్వారానూటికి 60 పైసల వడ్డీ తో రూ. 3 లక్షలు ఋణ సౌకర్యం కల్పించి ఈ రోజు మంజూరు పత్రాలు ఇచ్చామని లబ్ధిదారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. 350 చదరపు అడుగులు కన్నా ఎక్కువగా గృహనిర్మాణం చేసుకునేవారికి ఈ ఋణం ఒక గొప్ప సువర్ణ అవకాశం అని మంత్రి తెలిపారు. ఈ పధకం రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసి ఇండ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేసి సామూహికంగా గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టనున్నామని రంగనాధరాజు అన్నారు.

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఓయస్డి యన్.రామచంద్రారెడ్డి, జెడ్ పి ఫ్లోర్ లీడరు గుంటూరి పెద్దిరాజు, పోడూరి గోవర్ధన, ఏ పి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుమూడి రామచంద్రరావు, ఏ పి హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి పెద్దిరాజు, యం పి పి లు కర్రి వాసు రెడ్డి, పూతినీడి పెద్ద, నాయకులు కర్రి వేణు బాబు, రుద్రరాజు శివాజీ రాజు, చేకూరి సూరిబాబు, పోడూరి సత్య సాయిబాబా, మేడిచర్ల పండు, వివిధ శాఖలు అధికారులు , వివిధ గ్రామాలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *