విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. ఈ షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్యర్యం తీసుకురావాలని కాంక్షించారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడులు వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని పేర్కొన్నారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో తెలుగు లోగిళ్లన్నీ సుఖ: సంతోషాలతో కళకళలాడాలని.. ప్రజల కష్టాలు తీరిపోయి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వానలు సకాలంలో కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. పాడి పంటలతో రైతులు, సకల వృత్తులూ పరిఢవిల్లాలని.. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు మెండుగా అందాలని ఆకాంక్షించారు. కార్మికులు, నిరుపేదలు, సామాన్యులు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ నూతన వసంతంలో సుఖశాంతులతో వర్థిల్లాలని.. ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని అభిలషించారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …