Breaking News

ఖరీఫ్ 2021 సంబంధించి జిల్లాలో 13,321 మంది రైతులకు రు.50.71 కోట్లు పంటల బీమా పంపిణీ

-ఆర్ బి కే ల ద్వారా సేవలు పొందడం రైతుల హక్కు
-అందరికీ తిండి పెట్టే రైతులకు అండగా ఉంటాం
-జిల్లాలో ఇకపై ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుకు రసీదు ఇవ్వడం జరుగుతుంది -కలెక్టర్ వెల్లడి

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్రింద రైతులకు పంటల బీమా పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పామర్రు మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, పామర్రు శాసనసభ్యులు కైలె అనిల్ కుమార్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లాలో 13,321 మంది రైతులకు రూ.50.71 కోట్లుపంపిణీ గావించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు ఈ నెల 10వ తేదీన నీరు విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు పంటల సాగు ప్రారంభించాలని అన్నారు జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచామని, ఇంకా రైతుల అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు. ఈరోజు జిల్లాలో 13,321 మంది రైతులకు 50.71 కోట్లు పంటల బీమా పంపిణీ చేయగా, పామర్రు నియోజకవర్గంలోని రైతులకు 50 శాతం పైగా బీమా మొత్తాన్ని అందించినట్లు తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలు పొందడం రైతుల హక్కు అన్నారు. ఆర్ బి కే ల ద్వారా ప్రభుత్వ పథకాలు అందించే షెడ్యూలు గురించిన అవగాహన రైతులు కలిగి ఉండాలని సూచించారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం రైతులకు అందాలంటే ఈ క్రాప్ నమోదు తప్పనిసరి, పథకాల ప్రయోజనం రైతులు పొందడానికి ఈ క్రాప్ ఆధారం, ఈ క్రాప్ నమోదులో తప్పులు దొర్లితే రైతులు ప్రభుత్వ పథకాలు పొందలేరు. దీని నివారణకు జిల్లాలో ఈ ఏడాది ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేసుకున్నాక రసీదు ఇవ్వడం జరుగుతుందని, ఇచ్చిన రశీదులో తాను పండించే పంటలు వాటి విస్తీర్ణం సరిగా నమోదయ్యాయా లేదా సరి చూసుకుని సంతకం చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
అందరికీ తిండి పెట్టే రైతులకు అండగా ఉంటామన్నారు
జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పంటల బీమా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు తోడుగా ఆర్ బి కే లు ఏర్పాటు చేసి, రైతు భరోసా క్రింద సాగు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వైయస్సార్ యంత్ర సేవ పథకం క్రింద రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు.
పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తేచ్చారని అన్నారు. ఆర్ బి కే ల ద్వారా నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందిస్తూ భూసార పరీక్షలు నిర్వహిస్తూ, ఏ ఏ నేలల్లో ఏ ఏ పంటలు పండించాలి రైతులకు సూచనలు సలహాలు అందిస్తూ, ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదని అన్నారు. నియోజకవర్గం పరిధిలో తోట్లవల్లూరు మండలం లోనే రు.25 కోట్ల పంటల బీమా ఇచ్చినట్లు తెలిపారు. కౌలు రైతులను గుర్తించిన ఘనత జగన్ దే అన్నారు. యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందించుటకు కౌలురైతు చట్టాన్ని తెచ్చారని అన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతో ప్రయోజనం అన్నారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అమ్మ ఒడి విద్యాదీవెన వంటి పథకాలు పొందిన ప్రజలు తమ పిల్లలు చదువు పూర్తయి, ఉద్యోగాలు వచ్చే వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, గ్రామ సర్పంచ్ కె .కస్తూరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లా వ్యసాయ అధికారి కె. మనోహరరావు సభకు స్వాగతం పలికారు
ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ పరిధిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గుడివాడ ఆర్డీవో పద్మావతి, మత్స్య శాఖ జేడి లాల్ అహ్మద్, సర్పంచులు రైతులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *