Breaking News

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వన్ టౌన్ కొత్తపేట హనుమంతరావు ఫిష్ మార్కెట్ లో సుమారు 100 కేజీల కుళ్ళిన కోడిమాంసం, పొట్టేలు తలకాయ మరియు చేపలను నిల్వ ఉంచినట్లుగా గుర్తించిన వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవి చంద్ వారి సిబ్బంది కలసి నేటి ఉదయం సదరు మార్కెట్ లో ఉంచిన మాంసము పదార్ధములను స్వాదిన పరచుకొని దానిపై బ్లీచింగ్ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చివేయుట జరిగింది. ఈ మాంసపు పదార్దములు ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లుగా ప్రేగులను తొలగించి శుభ్రంగా శుభ్రపరచి పొట్టలో ఐస్ వేసి విజయవాడ నగరానికి ఫిష్ మార్కెట్లో తీసుకురావటం జరిగినదని, ఇది పూర్తిగా కుళ్ళిపోయిన మరియు రంగు మారిపోయిన మాంసము అని నిర్దారించడమైనది. సదరు యజమానిపై ప్రజారోగ్య చట్టం అనుసరించి నోటీసు ఇచ్చి అతనిపై కఠన తగు చర్యలు తీసుకున్నట్లు నిర్ణయించడమైనది. ఈ సందర్బంలో నగరంలో ఎవరైనా నిల్వ కలిగిన మాంసపు విక్రయాలు సాగించిన అట్టి వారిపై చర్యలు తప్పవని వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవి చంద్ హెచ్చరించారు. వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవి చంద్ మాట్లాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని తద్వారా లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సూక్ష్మంగా పరిశీలన చేసిన తరువాతే మాంసాలను కొనుగోలు చేయాలని ఆయన నగర ప్రజలకు సూచించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *