విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 25 లక్షలకు పైగా జనాభా ఉన్న రజకులు రాజకీయ రంగంలో అత్యంత వెనుకబడిన విషయంలో రజకుల పక్షాన నిలబడడంలో రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ కోసమే రజకులను వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తి ధోబి ఘాట్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షు లు చెన్నూరి చెన్నయ్య గాంధీ నగర్, ప్రెస్ క్లబ్ నందు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో నేటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి రజకులకు ఎస్సీ రిజర్వేషన్ విషయంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం రజకులకు ఎస్సీ రిజర్వే షన్లు ఇస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్న విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి రాజకీయ ఒత్తుడులకు లొంగకుండా, వ్యక్తులకు లొంగకుండా నిష్పక్షపా తంగా కమిటీ ఏర్పాటు చేసి రజకుల జీవన విధానం పై సమగ్ర నివేదికను తయారు చేసి రాష్ట్ర రజకులకు సరైన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 70% పైగా కొత్తవా రికి అన్ని రకాల రాష్ట్రస్థాయి చైర్మన్ లను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పదవుల్లో అవకాశాలు కల్పించి రజకుల విషయం మాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటారని మా రజకులకు 2024 సార్వత్రిక ఎన్ని కలలో మా జనాభా దామాషా ప్రకా రం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయిం చవలెనని కోరారు. ఈ కార్యక్రమం లో కందగట్ల శ్రీనివాసరావు, ఊకోటి శేషగిరిరావు, కుందేటి వీర వెంక టేశ్వరరావు, అడపాక అప్పారావు, సింహాచలం, దుర్గాప్రసాద్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …