విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పారదర్శకంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడపగడపలో సంతోషం నింపారని అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ ప్రాంతాల్లో సచివాలయం సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ ప్రాంతంలో రోడ్లు,సైడ్ డ్రైనేజీ,ఇతర అభివృద్ధి పనులు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వేయడం జరిగిందని అన్నారు. దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది,మరలా ఇప్పుడు మా హయాంలో మాత్రమే జరుగుతుంది అని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైస్సార్సీపీ పార్టీకి పట్టం కట్టరాని వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రవల్లిక ఇక్కడి పెద్దలు అందరి సహకారంతో సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అందరికి పధకాలు అందేలా కృషి చేస్తున్నారు అని,నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు.ఇంకా ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందకపోతే ఈ పర్యటన లో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 3వ డివిజన్ కార్పొరేటర్ భిమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు ఏలూరి శివాజీ, గౌస్, కోటి రెడ్డి, డేవిడ్ రాజు, భీమిశెట్టి బాబు, బీమ్ శెట్టి నాని మరియు కనకదుర్గా నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం అందజేత
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ కామినేని నగర్ డొంక రోడ్ నందు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన నక్కా ధనలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా శుక్రవారం నాడు వారికి వైద్య ఖర్చులు నిమిత్తం ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా 5,000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.