తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి మద్యం అక్రమ తయారీ నిరోధం పై చర్యలు చేపట్టి నాటు సారా తయారీ వృత్తి గా పలు మార్లు కేసులలో ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కల్పించి వారిలో మార్పు తీసుకురావాలని ఆదేశించిన మేరకు జిల్లాలో ప్రస్తుతం గుర్తించిన 30 మందికి జీవనోపాధి మార్గాలకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు డి.ఆర్.డి.ఎ, ఎస్.ఈ.బి, ఎక్సైజ్, బ్యాంకర్స్ తో జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సారా వృత్తి గా జీవనం సాగిస్తూ పలు మార్లు వివిధ కేసులలో ఉన్న వారి కుటుంబాల పరిస్థితి ని అద్యయనం చేసి 15 రోజుల్లోగా వారిలో మార్పు వచ్చేలా వారి జీవనోపాధికి కావాల్సిన అవసరాలను గుర్తించాలని అన్నారు. కేసులలో ఉన్న వారి కుటుంబాల మహిళలు స్వయం సహాయక సంఘాలలో ఉన్నట్లయితే వారికి వాస్తవాలను, అనర్థాలను వివరించి ఉపాధి కోసం రుణం అవసరమైతే మంజూరు చేస్తామని వివరించి వారిని సక్రమ మార్గంలో నడిచేలా చూడాలని సూచించారు. ఇందుకోసం ఎస్.ఈ.బి., డి.ఆర్.డి.ఎ, బ్యాంకర్స్ సంయుక్తంగా అద్యయనంతో సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో పి.డి. డి.ఆర్.డి.ఎ జ్యోతి, ఎస్.ఈ.బి. సూపరింటెండెంట్ స్వాతి, లీడ్ బ్యాంక్ మ్యానేజర్ సుభాష్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …