Breaking News

ర్యాగింగ్ మానవ హక్కుల ఉల్లంగన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి రామ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి యాంటీ ర్యాగింగ్ చట్టంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని , చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కళాశాలలో చేరిన విద్యార్థులు స్నేహభావంతో మెలగాలన్నారు. అలాకాకుండా తోటి విద్యార్థులను ఇబ్బందులు పెడితే చట్టం ఉచ్చులో ఇరుక్కొని జైలుకు పోవాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత నిమిత్తమై రూపొందించిన దిశా ఆప్ పైన అవగాహన కల్పిస్తూ, విద్యార్థినులందరూ విధిగా ఫోన్ లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, దీని ద్వారా ఆపద సమయంలో పోలీసులకు సమాచారం అందించి తక్షణ సహాయం పొందొచ్చని, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత మహిళకు రక్షణ కల్పిస్తారని అన్నారు. అనంతరం స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ శారద మరియు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామకృష్ణ మాట్లాడుతూ సీనియర్లు తమపట్ల దురుసుగా ప్రవర్తించిన ఎడల సంకోచించక వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని , క్యాంపస్ లో ఇలాంటి కార్యకలాపాలకు తావు లేదని, జూనియర్లకు ఇబ్బంది కలిగించే చర్యలు జరగకుండా ఇప్పటికే పటిష్టమైన చర్యలు తీసుకున్నామని భరోసా ఇచ్చారు. కనుక విద్యార్థినిలు నిర్భయంగా వారి చదువు పైన దృష్టి పెట్టి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *