రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం ఫ్యామిలీ కాన్సెప్ట్ కింద వైద్య సేవలు అందించే క్రమంలో మ్యాపింగ్ చేపట్టడం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలు నిర్మాణం పూర్తి చెయ్యడం లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. గురువారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ టి కృష్ణబాబు జిల్లా కలెక్టర్ లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతి నివేదిక వివరాలు తెలుపుతూ, జిల్లాలో 337 వైయస్ఆర్ వి.హెచ్. సి భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, వీటిలో 164 భవనాలు పూర్తి అవ్వగా, 52 నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి అని పేర్కొన్నారు. బీఏల్ లో 45, ఆర్ ఎల్ 53, రూఫ్ లైడ్ లో 35 ఉన్నట్లు తెలిపారు. నవంబర్ ఒకటిన ప్రారంభం కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మేరకు వైద్య సేవలు అందించే విధానం పై డి ఎమ్ అండ్ హెచ్ ఓ కి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు సూచనలు ఇవ్వడం, అందుకు అనుగుణంగా డాక్టర్ లు, సిబ్బంది విధులు కేటాయించే ప్రక్రియను ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. రక్త హీనత , అమీబియా కలిగిన తల్లుల గుర్తింపు ప్రక్రియను సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో 93,484 మందికి చెందిన డేటా పై అధ్యయనం చేసి, వారి ఆరోగ్య స్థాయి పై సమీక్ష చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశం లో డి ఎమ్ అండ్ హెచ్ ఓ డా కే. వేంకటేశ్వర రావు, డా సనత్ కుమారీ, ఇతర వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …