-వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల ప్రగతికి బాటలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్ లొ మంగళవారం స్ధానిక 53 వ. డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ పాఠశాల విద్యార్థుల సైన్స్ ఫేయిర్ ని ప్రారంభించారు. విద్యార్థుల సామర్ధ్యాన్ని సైన్సు,గణిత వైజ్ఞానిక ప్రదర్శనలు ఇతోధికంగా ఉపయోగపడతాయని కొనియాడారు మరియు ఉపాద్యాయులను ప్రశంసించారు, ఈ ప్రదర్శనలో పాఠశాల HM., M.నాగలింగేశ్వర రావు, గణిత, సైన్సు టీచర్స్ యశోద, ఫరీసా అక్తర్, ముంతాజ్ సుల్తానా, స్కూల్ సూపర్వైజర్ యం.డి. హుస్సేన్, సిబ్బంది మరియు స్ధానిక పెద్దలు పాల్గొన్నారు. సర్కిల్ -1 లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు వీక్షించారు.