తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాధాన్యతను గుర్తించాలని భూసేకరణ, పరిహారం చెల్లింపులు చేపట్టి రహదారుల నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్డు రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ పి.ఎస్.ప్రద్యుమ్న సూచించారు. గురువారం మద్యాహ్నం అమరావతి నుండి రాష్ట్ర రోడ్డు రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్ లతో, జాయింట్ కలెక్టర్ లతో ఎన్.హెచ్.ఎ.ఐ. , ఆర్ అండ్ బి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జే.సి. డి.కె.బాలాజీ, ఎన్.హెచ్ పి.డి. హరికృష్ణ, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పి.ఎస్.ప్రద్యుమ్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణాలకు రూ.50 వేల కోట్లు అందుబాటులో ఉందని భూసేకరణ, పరిహారాల చెల్లింపు పూర్తి చేసి ప్రారంభంకాని రహదారులను ప్రారంభించాలని, పురోగతిలో ఉన్న రహదారులు వేగవంతం చేయాలని సూచించారు. జే.సి. డి.కె.బాలాజీ వివరిస్తూ జిల్లాలో 232 హెక్టార్ల భూ సేకరణకు సంబంధించి రానున్న జనవరి 9 నాటికి పూర్తి చేస్తామని రేణిగుంట – నాయుడుపేట జాతీయ రహదారికి సంబంధించి పనులు జరుగుతున్నాయని భూసేకరణ విషయంలో సదాబైనామా భూముల వల్ల పరిహార చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని త్వరగా పరిష్కరిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో రెవిన్యూ అధికారులు, ఎన్.హెచ్.ఎ.ఐ., ఆర్ అండ్ బి శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …