Breaking News

ఎం ఎల్ సి ఎన్నికల సన్నద్ధత వివరాలు పై సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల నియోజక వర్గాల ఎం ఎల్ సి ఎన్నికల పరిశీలకులు కోన శశిధర్ మరియు ఎస్.హెచ్. భాస్కర్ కాటమనేని వారు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తో కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం మధ్యాహ్నం సమావేశమై ఎం ఎల్ సి ఎన్నికల సన్నద్ధత పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ప్రకాశం- నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల నియోజక వర్గ ఎం ఎల్ సి కు సంబంధించి అనుబంధ పోలింగ్ కేంద్రాలతో కలిపి 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 23 న ప్రచురించిన ఓటర్ల జాబితా మేరకు 86941 ఓటర్లు ఉన్నారని, ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గాల కు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు ఓటర్లు 6132 ఉన్నారని అన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు ఏర్పాటు చేసి పర్యవేక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లో పరిధిలో 23 సెక్టార్లు ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లను నియమించి 140 పోలింగ్ కేంద్రాలకు అనుసంధానం చేశామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 15 మంది నోడల్ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్పీ వివరిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *