Breaking News

అను హాస్పిటల్లో అరుదైన గుండె చికిత్స

– అత్యంత క్లిష్టమైన వాల్వ్ మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించిన అను వైద్యులు
– కార్డియాలజీ బృందాన్ని అభినందించిన అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్
– అను ఇనిస్టిట్యూట్ లో అత్యాధునిక చికిత్సలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గుండెకు సంబంధించిన అరుదైన చికిత్సను అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన ఈ చికిత్స గురించి తెలియజేసేందుకు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “నర్సీపట్నానికి చెందిన పెట్ల అప్పలనాయుడు (65) బృహద్ధమని కవాటం (వాల్వ్) పూడుకుపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకరస్థితిలో వున్న పేషేంటుకు అను వైద్యులు వాల్వ్ మార్పిడి ఆపరేషన్ నిర్వహించి, ప్రాణాపాయం నుంచి రక్షించారు. వాల్వ్ సమస్యతో వున్న రోగులకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా వాల్వ్ మార్పిడి జరుగుతూ ఉండేది. కానీ, శస్త్రచికిత్స లేకుండానే, పూడుకుపోయిన వాల్వ్ స్థానంలో తొడ ధమని ద్వారా కొత్త వాల్వ్ ను అమర్చడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు. అత్యాధునిక క్యాథలాబ్ లో ఏ విధమైన కోత లేకుండా ఈ చికిత్సను పూర్తి చేసి, రోగిని రెండు మూడు రోజుల్లోనే హాస్పిటల్ నుండి ఇంటికి పంపించవచ్చు. ఈ చికిత్సను ట్రాన్సకాథెటర్ వాల్వ్ ఇంప్లాంటేషన్ గా పరిగణిస్తారు” అని తెలిపారు. ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి, అను గ్రూప్ ప్రతిష్టను ఇనుమడింపజేసిన కార్డియాలజిస్టులు డా. నాగేశ్వరావు, డా. పాల్ కిరణ్, డా. శివదయాల్, డా. సంతోష్ కుమార్ ల బృందాన్ని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ అభినందించారు. ఈ సమావేశంలో అను ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, రేడియాలజీ విభాగాధినేత డాక్టర్ శ్రీలలిత మాట్లాడుతూ.. కార్డియాలజీ, న్యూరో విభాగాలకు సంబంధించి అత్యున్నత స్థాయి చికిత్సలు తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విశిష్ట అనుభవం కలిగిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. చికిత్స అనంతరం కోలుకున్న రోగి అప్పలనాయుడు, ఆయన కుటుంబసభ్యులు అను కార్డియాలజీ బృందానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *