Breaking News

జిల్లా కలెక్టర్ పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన

-ఎంఎల్సి ఎన్నికల సన్నద్ధత,ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కలెక్టర్

గూడూరు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 13 న మండలి పోలింగ్ జరగనున్న నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు వుండాలని బ్యారికేడ్స్ ఏర్పాటు, చెక్ లిస్ట్ మేరకు వసతులు వుండాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారుల ను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విసృత పర్యటన చేపట్టి అధికారులకు పలు సూచనలు చేశారు. గూడూరు డివిజను నందు పోలింగ్ స్టేషన్ల పరిశీలనలో భాగంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ తో కలసి ప్రకాశం – నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గము మరియు ఉపాధ్యాయ నియోజక వర్గము మండలి ఎన్నికలు జరగనున్న పోలింగ్ కేంద్రాలు జడ్పీ బాలికల హై స్కూల్ , వెంకటగిరి నందు మౌలిక సదుపాయాలు మరియు కనీస సౌకర్యాల కల్పన ఉన్నాయా లేవని పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి మాట్లాడి, ఆరో తరగతి విద్యార్థి పుట్టినరోజు అని తెలుసుకుని విద్యార్థినిని ఆశీర్వదించారు.

కోట ఏవి కె ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, మధ్యాహ్న సమయం కావడంతో పిల్లలకు అందిస్తున్న గోరుముద్ద రుచి చూసి పలు సూచనలు చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించి గుర్తించిన పౌష్టికాహార లోపం కల పిల్లలకు సప్లిమెంట్ అదనంగా చిక్కీలు , గుడ్డు వంటివి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ అదానంగా ఇవ్వాలని అపుడే పిల్లలు రక్తహీనత నుండి బయటపడి ఆరోగ్యంగా ఉంటారని, చదువు పై శ్రద్ద చూపగలరు అని అన్నారు. అనంతరం గూడూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ , బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

వాకాడు తహశీల్దార్ కార్యాలయం ఆవరణములో ఉన్న స్త్రీ శక్తి భవనములో ఎం ఎల్ సి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ,అక్కడ భవనాన్ని, వసతులను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో చేస్తున్న ఏర్పాట్లపై ఎంపీడీవో తోట గోపీనాథ్, ఇన్చార్జి తాసిల్దార్ సారంగపాణి జిల్లా కలెక్టర్ వారికి వివరించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *