Breaking News

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి

-మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని ఈ నెల ఆఖరి లోపు పూర్తి చేయాలి
-గృహ నిర్మాణంలో రోజు వారీగా స్టేజి పురోగతి ఉండాలి:కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో పరిష్కరించాలని, పర్యాటక శాఖకు చెందిన భూమి అలియనేషన్ త్వరితగతిన చేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలు మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, పర్యాటక శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖల అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి జెసి డి కే బాలాజీ తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టరేట్ నుండి హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న జగనన్న భూహక్కు – భూ రక్ష రీసర్వే లో రెండవ ఫేజ్ గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, వెక్టరైజేషన్ డి ఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ రాళ్ళు తగినన్ని అందుబాటులోకి వస్తాయని ఈ నెల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలనీ సూచించారు. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అలియనేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేసేలా ఉండాలని అన్నారు. స్పందన అర్జీలపై సకాలంలో స్పందించి బియాండ్ ఎస్.ఎల్.ఎ కు వెళ్లకుండా అర్థవంతమైన నాణ్యతతో కూడిన పరిష్కారం అర్జీదారులకు చూపాలని, త్వరిత గతిన అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఈ అంశం ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారని అన్నారు.

వ్యవసాయశాఖను సమీక్షిస్తూ ఈ సంవత్సరం చిరుధాన్యాలు సాగుపై దృష్టి పెట్టాలి అని అన్నారు. సి హెచ్ సి గ్రూపులకు మెషినరీ సబ్సిడీపై అందించి ఆర్బికే స్థాయిలో అందుబాటులో ఉంచి తక్కువ అద్దెతో వినియోగించడం కొరకు జిల్లాలో మంచిగా జరుగుతోందని ఇంకనూ అవసరమైన మెషినరీ ఈ నెల 28 లోపు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న పాల వెల్లువ కింద రిజిస్టర్ అయిన రైతులకు ప్రాధాన్యతతో చేయూత పథకం కింద పాడి పశువులు మంజూరు కొరకు చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ గోడౌన్ లు మొదటి ఫేజ్ కింద మంజూరు అయిన వాటిని జూలై23 నాటికి, రెండవ ఫేజ్ కింద మంజూరు అయిన వాటిని నవంబర్23 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేసేలా వివిధ స్టేజిలో ఉన్నవాటిని పూర్తి చేసే దిశగా వేగవంతం చేయాలని, స్టేజి వారీగా పురోగతి ఉండాలని ఆదేశించారు. పునాది పడిన ఇంటి నిర్మాణాలకు పొదుపు సంఘాల ద్వారా అదనపు రుణం లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీ లోని కేటగిరి3 లేఔట్ లలో తాగు నీటి కొళాయిలు ఏర్పాటు, విద్యుత్తు కనెక్షన్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. సామూహిక గృహ ప్రవేశాలు మే లో ఉండే నేపథ్యంలో పురోగతి ఉండాలని సూచించారు. స్వామిత్వా పై దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడీ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ప్రాంతీయ సంచాలకులు రమణ ప్రసాద్, జిల్లా సర్వే అధికారి జయరాజ్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ కుమార్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శంకర్ నారాయణ, జిల్లా పంచాయితీ అధికారి రాజ శేఖర్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *