అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను సీపీఎం, సీపీఐ నాయకులు కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఏ. మల్లికార్జున, ఐజీ బి. రాజకుమారి పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు సిట్ ఏర్పాటు చేయాలి…
