Breaking News

తిరుమల శ్రీవారి ఆశ్శీస్సులతో శ్రీవారి చెల్లెలు గంగమ్మతల్లి జాతర బ్రహ్మోత్సవాలు : భూమన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి ఆశ్శీస్సులతో అంగరంగ వైభోగంగా, ఎవరూ వూహించని విధంగా శ్రీవారి చెల్లెలు గంగమ్మతల్లి జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఉంటుందని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ పున: ప్రతిష్ట శ్రీకారం మహా కుంభాభిషేకం కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు, మేయర్ శిరీషా , ఉప మేయర్ భూమన అభినయ రెడ్డి మహా కుంభాభిషేకము సందర్భంగా మొదటి రోజు పాల్గొన్నారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మహా కుంభాభిషేకము సంబంధించిన ప్రధాన కలశము మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవత ఆవాహనము, స్వర్ణ యంత్రమును వారి చేతుల మీదుగా ఆలయ ఆలయ ప్రదర్శనం నిర్వహణతో 70 మంది వేద పండితులచే ఈ మహా కుంభాభిషేకము కార్యక్రమము ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ గత వేయి సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి ప్రథమ శిష్యుడు అనంత ఆల్వార్ అమృత హస్తాలతో శ్రీవారి చెల్లెలు తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ పున: ప్రతిష్ట జరిగిందని , నేడు మరోమారు వారి వంశస్థులు 22 వ తరం కస్తూరి రంగన్, వేద పండితులు యాగ నిర్వహణ కు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ ఏడాది ఈ మాసంలో 9 వ తేది నుండి 16 వతేది వరకు జరిగే తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆశ్శీస్సులతో అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నామని అన్నారు. అనంతరం గంగమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత తెలిపే ప్రచార వాహనాలను ప్రారంభించారు. దేశంలోనే మొదటి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ తల్లి వైభవాన్ని జగమంతా చాటుదామని అన్నారు. క్రేడాయ్ , తిరుపతి చైర్మన్ శ్రీనివాసులు, ప్రెసిడెంట్ రామప్రసాద్ , ట్రెజరర్, సభ్యులు కలసి గంగమ్మ జాతర నిర్వహణకు తమవంతుగా రూ. 10 లక్షల చెక్కు ను స్థానిక శాసన సభ్యుల అందించారు. ఆలయ ఛైర్మన్ శ్రీ. కట్టా గోపి యాదవ్ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి యం. ముని కృష్ణయ్య , ధర్మకర్తల మండలి సభ్యులు టి. వెంకటేశ్వరరావు, టి. రమణమ్మ, పి. ధన శేఖర్, వి. కృష్ణమ్మ, యం. భారతి, ఆలయ అర్చకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *