-ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ 2023 ను డిక్లరేషన్ తో ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి :ఆర్. కే రోజా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సిఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్ ను తిరుపతి జిల్లా లో జరపడం ఎంతో సంతోషిస్తున్నామని క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం నందు 2023 సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏ.పి సి.ఎం కప్ టోర్నమెంట్‌ను 1 మే 2023 నుండి 05 మే2023 వరకు తిరుపతిలో పురుషులు మరియు మహిళల కొరకు 14 విభాగాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీమతి ఆర్ కె. రోజా ,శ్యాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, యువజన సర్వీసులు శ్రీమతి వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, శ్యాప్ విసి అండ్ ఎండీ హర్ష వర్ధన్, శ్యాప్ డైరెక్టర్ల తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర స్థాయి సిఎం కప్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా మొదలు 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్ర లో ఇంత పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదని, ఇది గొప్ప కార్యక్రమం అన్నారు. సుమారు 4900 మంది మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారని అన్నారు.
తిరుమల శ్రీవారి పాదాల చెంత క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషం అన్నారు. మనం క్రీడలలో పాల్గొనడం గెలిచేందుకు పోటీ పడాలని, మెడల్ సాధించలేక పోయినా నిరాశ చెందాల్సిన పనిలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తుందని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు గా ఎదుగుటకు తోడ్పాటు ఉంటుందని అన్నారు. క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపి ఏపీ సిఎం కప్ 2023 డిక్లరేషన్ తో క్రీడలను ప్రారంభించారు.
శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, సిఎం గారి ప్రోత్సహం తో సంక్రాంతి సంబరాలు, క్రీడా సంబరాలు తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించి ప్రైజ్ మనీ అందించామని అన్నారు. సిఎం కప్ గత ఎనిమిది నెలలుగా ఏర్పాటు చేయాలనుకున్నామని, నేడు మంత్రి రోజా గారి చొరవతో నేడు ఇది సాకారం అయిందని అన్నారు. సిఎం గారి తర్వాత, రోజా గారిని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని, వారు ఎన్నో అవాంతరాలను ఎదుర్కుని ఈ రోజు మంత్రిగా యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడా శాఖ లతో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొంటూ, ప్రజల్లో మమేకం అయి నిరంతరం శ్రమిస్తున్నారు అని అన్నారు. జీవితం చాలా చిన్నదని, సంతోషంగా ఉండాలని, స్నేహితులతో సంతోషంగా గడపాలని ఈ టోర్నమెంట్ లో పాల్గొనే అందరు క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, ఎస్.ఈ ఆర్డబ్ల్యూఎస్ విజయకుమార్, సిఈఓ సేట్విన్ మురళి కృష్ణ రెడ్డి, పిడి డి ఆర్ డి ఏ జ్యోతి, చీఫ్ కోచ్ సయ్యద్ హుస్సేన్, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.