Breaking News

తూర్పు గోదావరి జిల్లా కు ప్రతిష్టాత్మక మైన గవర్నర్ అవార్డ్

-మే 8 న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డ్ ప్రధానం
-కలెక్టర్ ను అభినందించిన జేసీ భరత్, కమిషనర్ దినేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత ప్రతిష్ఠాత్మక రెడ్ క్రాస్ విభాగం కు చెందిన గవర్నర్ అవార్డు సొంతం చేసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య వంతమైన కార్యక్రమాలు అమలు నేపథ్యంలో గవర్నర్ చేతుల మీదుగా ప్రతి ఏటా అవార్డులను ప్రధానం చెయ్యడం జరుగుతుందని తేజ్ భరత్ తెలిపారు. ఆమేరకు జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.40 లక్షల మేర విరాళాలు సేకరణ చెయ్యడం జరిగిందన్నారు. జిల్లా రెడ్ క్రాస్ శాఖ ద్వారా సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక అంశాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల కలెక్టర్లకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం మన జిల్లాకు దక్కిందని , ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె మాధవీలత దిశా నిర్దేశనం చేసినట్లు రెడ్ క్రాస్ విభాగం జిల్లా చైర్మన్ వై. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ లో మే 8 వ తేదీన గవర్నర్ బంగ్లాలో జరిగే అవార్డు వేడుకల కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత గవర్నర్ వారి చేతుల మీదుగా ఈ అవార్డ్ స్వీకరిస్తారని ఆయన తెలిపారు. రెడ్ క్రాస్ విభాగం ద్వారా జిల్లాలో మానవతా స్ఫూర్తిని , సేవా భావాన్ని పెంపొందించు కునేలా ప్రోత్సహించే ఉద్దేశంతో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ విభాగాలు పని చేస్తున్నాయన్నారు. రూ.18 లక్షలతో నగరంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ భవన నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం రెడ్ క్రాస్ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యం లో కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ కే మాధవిలత వారి సూచన మేరకు, ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వెనుక డాక్టరు బీ ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులం నందు హైజీన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు నరేష్ రాజు, అనంత రావు, డాక్టర్ మహా లక్ష్మి, కో ఆర్డినేటర్ ప్రకాష్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కు అభినందనలను తెలిపిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కమిషనర్ కె. దినేష్ కుమార్ , డి ఆర్వో నరసింహులు, జిల్లా చైర్మన్ వై. మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి జక్కంపూడి విజయలక్ష్మి,  వైస్ చైర్మన్ దాల్ సింగ్, సభ్యులు గొట్టిముక్కల అనంతరావు, నరేష్ రాజు, సత్యనారాయణ, కె.వి. రమణ, మహాలక్ష్మి  ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *