విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పరీక్షల పరిశీలకులు యం.వి. శేషగిరిబాబు ఆయా కేంద్రాల ఛీప్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ ఆఫీసర్లు, సహాయ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యం.వి. శేషగిరిబాబు మాట్లాడుతూ ఈనెల 28వ తేది ఆదివారం నిర్వహించే యుపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్షకు 12,359 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, పేపర్`1 పరీక్షను, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు పేపర్`2 పరీక్ష నిర్వహించడం జరగుతుందన్నారు. జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షలకు నగరంలో 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 1,174 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. పటమట కెబిసి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాసే 55 మంది విభిన్నప్రతిభావంతుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు 29 మంది వెన్యూ సూపర్‌వైజర్లతో పాటు 29 మంది లైజన్ ఆఫీసర్లు, 85 మంది అసిస్టెంట్ సూపర్‌వైజర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన త్రాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను ఒక రోజు ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్‌లేటర్లు, మొబైల్‌ఫోన్లు, తీసుకురాకుడదన్నారు. ప్రతి కేంద్రంలోను పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ముందుగానే చేరుకునే విధంగా ఆయా రూట్‌లలో బస్సులను నడిపే విధంగా ఏపిఎస్ ఆర్‌టిసీ ఏర్పాట్లు చేసుకోవాలని పరీక్షల పరిశీలకులు యం.వి. శేషగిరిబాబు అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణపై ఈనెల 17వ తేదిన వెన్యూ సూపర్‌వైజర్లు లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించామని పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో జామర్లను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డిల్లీరావు వివరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, ఆర్‌డివోలు వైవి ప్రసన్నలక్ష్మి, ఆర్ రవీంద్రరావులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …