Breaking News

ఇల్లు కట్టించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయదు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ప్రాంతంలో ఇళ్లస్థలాలు కేటాయించిన పేదలకు ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన ఇల్లు కట్టించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయదని పామర్రు శాసనసభ్యులు శాసనసభ హామీల కమిటీ చైర్మన్ కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని రహదారులు భవనాలు అతిధిగృహంలో వారు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని వారిని అక్కున చేర్చుకుని ప్రోత్సహించి పైకి తేవాలన్నదే వారి అభిమతం అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చేసే ప్రయాణంలో తాము సైనికులుగా వెన్నుదన్నుగా ఉండి పేదలకు ముఖ్యంగా దళితులకు న్యాయం జరిగే విధంగా ముందుకెళతామన్నారు. రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి ఆర్ – 5 జోన్ లో పేదలందరికీ 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ఇందుకోసం షేర్ వాల్ టెక్నాలజీ వారితో ఒప్పందం కూడా చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్ల నిర్మాణానికి అనుమతి తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అర్హత కలిగిన వారికి మాత్రమే పూర్తిగా నేరుగా వారికే జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు చేపడుతుందన్నారు. రహదారుల నిర్మాణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారన్నారు. ఇందుకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామన్నారు. ప్రజల అవసరాలను తీర్చడం తమ బాధ్యత అన్నారు. తప్పకుండా అన్ని రహదారులను నిర్మిస్తామని దెబ్బతిన్నవి అన్ని విధాలా బాగు చేస్తామని చెప్పారు. పామర్రు గుడివాడ రహదారి జాతీయ రహదారి లో చేర్చి టెండర్లు ఖరారయ్యాయని త్వరలో నిర్మాణం పనులు చేపడుతామన్నారు. కూచిపూడి అవనిగడ్డ చల్లపల్లి రహదారి వర్షానికి పాడైపోయిందని మొన్ననే పామర్రు నుండి ఐఎల్టి పెదపూడి వరకు 5.50కోట్ల రూపాయల వ్యయంతో రహదారిని నిర్మించామన్నారు. అందులోనే మొవ్వ-కొడాలి వరకు కూడా రహదారి నిర్మించామన్నారు. మధ్యలో పాడైపోయిన ఒక భాగంలో రహదారి నిర్మాణానికి 12.50 కోట్ల రూపాయలు ఎఫ్ డి ఆర్ కింద మంజూరయ్యాయన్నారు. వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో 20 లక్షల రూపాయలతో రహదారిని మరమ్మతు చేశామన్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయులు 5వేల మంది పాత్రికేయులకు కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పామర్రు బస్టాండు కొన్ని సంవత్సరాల నుండి పట్టించుకోలేదని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోగా ఆయన వెంటనే స్పందించారని అక్కడ
బస్టాండు చదును చేసి టెండర్లు ప్రక్రియ జరుగుతుందని ఒక వారం రోజుల్లోగా శంకుస్థాపన చేసి బస్ స్టాండ్ ను బాగు చేస్తామన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *