రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి ఖైదీల ఆరోగ్య పరిస్థితులను గురించి వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లు వారికి అందుబాటులో ఉంటారని, ఏ విధమైన న్యాయ సమస్యలు ఉన్నా వారి ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో శిక్షలు తీవ్రంగా ఉంటాయని, బెయిల్ లభించడం కూడా కష్టమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల దుష్ప్రభావాల గురించి వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పరివర్తన చెంది గౌరవంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో జైల్ అధికారులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …