-పీడీఎస్ బియ్యం రవాణా చేయు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో 5,64, 555 కార్డులకు గాను 15 లక్షల 79 వేల మందికి గానూ 84225.90 క్వింటాల్ నాణ్యమైన సార్టేక్స్ బియ్యాన్ని ఉచితంగా, నూనె, పంచదార, ఇతర సరుకులను ఇండెంట్ ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద చౌక ధరల దుకాణముల ద్వారా సరఫరా చేయబడుచున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డి ఎమ్ మార్కెటింగ్ ఎ.కుమార్, ఇంచార్జి డి ఎస్ వో కే. విజయ భాస్కర్ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో జేసీ మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో 870 రేషన్ దుకాణాల ద్వారా 364 ఎం డి యూ వాహనాల ద్వారా ఇండెంట్ మేరకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. జిల్లా నందలి మండల స్థాయి స్టాక్ పాయింట్స్ ద్వారా కచ్చితమైన తూకంతో రేషన్ షాప్ లకు, రేషన్ షాప్ ల నుండి మొబైల్ డెలివరీ వాహనాలు ద్వారా కార్డు దారులకు కచ్చితమైన తూకంతో బియ్యం ఇంటింటికీ పంపిణి జరుగుచున్నదన్నారు. జిల్లాలో ప్రతినెలా 94.5 శాతం మంది కార్డు దారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. పిడిఎస్ ద్వారా బియ్యం పంపిణీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కేజీ కి Rs.40/- చొప్పున జిల్లాలో రూ.32 కోట్ల మేర, రాష్ట్ర స్థాయిలో 846 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్కు పేర్కొన్నారు. ఇటీవల రాజానగరం లో పిడి ఎస్ బియ్యంతో పలు వంటకాలు కార్యక్రమం అవగాహన కలుగ చేశామన్నారు. నాణ్యమైన సార్టెక్స్ బియ్యం కార్డు దారులకు ప్రభుత్వం ఇచ్చుచున్నదన్నారు. . బియ్యం లో ఉన్న పోషక విలువలపై అవగాహనా లేకపోవడం వలన సదరు బియ్యం కొంత మంది అమ్మివేయడం వలన ప్రజా ధనం అక్రమ వ్యాపారస్తులకి లాభం చేకూర్చడం గుర్తించామన్నారు ..
ఆహార భద్రతా చట్టం క్రింద ప్రతి ఒక్క పేదవాడికి తిండి అందేలా చేయాలి అన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నదని, కావున దానిని అరికట్టవలేనన్న ప్రజల ఆలోచన విధంలో మార్పు రావలెనని పిడిఎస్ బియ్యం లో ఉన్న పోషకవిలువలు విశిష్టత తెలియ పరుస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రాజానగరం వారి కార్యాలయ ఆవరణలో సుమారు 100 మంది కార్డు దారులతో ఒక వినూత్న కార్యక్రమంను ది.16.07.2023 (ఆదివారం ) “పిడిఎస్ బియ్యంతో పలురకముల వంటకముల పోటీ” కార్యక్రమం కమీషనర్, పౌరసరఫరాలు శ్రీ హెచ్.అరుణ్ కుమార్, ఐ.ఎ.ఎస్ వారి అధ్వర్యంలో నిర్వహించి మొదటి నాలుగు స్థానములో నిలిచిన వారికీ నగదు బహుమతి అందజేసి వున్నారు.
అంతే కాకుండా, ఈ బియ్యాన్ని ప్రక్కదారి పట్టకుండా ఉండుటకు మరియు ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పేదలకు పంపిణీ జరుగుటకు ఒక ప్రక్క జిల్లా రెవిన్యూ మరియు పౌర సరఫరాల యంత్రాంగంతో చౌక ధరల దుకాణముల తనిఖీ చేయించుట, ప్రతి నిత్యం నిఘా ఏర్పాటు చేసి రాత్రి మరియు పగటి వేళల్లో జాతీయ రహదారుల నందు గస్తీలు నిర్వహించుట జరుగుతున్నదన్నారు. రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు కూడా ఇదే తరహాలో సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ విధంగా చేసిన తనిఖీలు లేదా సోదాలలో సరుకుతో పాటుగా పట్టుబడిన వాహనాలు, సంబందిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తూ, అపరాధ రుసుములు విధించుట జరుగుచున్నది.
తూర్పుగోదావరి జిల్లా నందు అక్రమంగా తరలిస్తూ పట్టుబడి జప్తు చేయబడిన పి.డి.ఎస్ బియ్యం వివరాలు..
2017సం.రంలో 1.79 కోట్లు విలువగల 4485.20క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 48 కేసులకు నమోదు చేసామని, 2018సం.రంలో 1.34 కోట్లు విలువగల 43358.15క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 53 కేసులకు నమోదు చేసామని, 2019 సం.రంలో 1.53 కోట్లు విలువగల 3834.40క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 124 కేసులకు నమోదు చేసామని, 2020 సం.రంలో 1.23 కోట్లు విలువగల 3092.67 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 93 కేసులకు నమోదు చేసామని, 2021సం.రంలో 1.88 కోట్లు విలువగల 4703.50క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 92 కేసులకు నమోదు చేసామని, 2022 సం.రంలో 3.96 కోట్లు విలువగల 9912.31 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 130 కేసులకు నమోదు చేసామని, 2023సం.రంలో ఇప్పటి వరకు 1.34 కోట్లు విలువగల 3356.58 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరళించిన వారిపై 93 కేసులకు నమోదు చేసామని,
పైన పేర్కొన్న లెక్కల ప్రకారం, ప్రస్తుతం పటిష్ట నిఘా ఏర్పాటుచేసి పీడీఎస్ బియ్యం రవాణా చేయు అక్రమార్కులపై క్రిమినల్ మరియు 6-A కేసు లు నమోదు చేస్తున్నామన్నారు. కొవ్వుర్ డివిజన్ లో ఆగస్టు-2023 నుండి మరియు సెప్టెంబర్ -2023 నుండి జిల్లా లోని కార్డు దారులకు యండీయుల ద్వారా ఫోర్టిపైడ్ పంపిణి చేయుటకు ప్రభుత్వం నిర్ణ హించిదన్నారు. ప్రజా పంపిణి వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి నిర్ణయములు తీసుకుని, కార్డు దారుల యొక్క ప్రశంసలు పొందుచున్నదని జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.