Breaking News

పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం మనది

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో ఆరో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆర్థికాభివృద్ధే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని.. ఆ దిశగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో కలిసి శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నందమూరినగర్, తమ్మిన దుర్గారావు వీధులలో విస్తృతంగా పర్యటించి.. 205 గడపలను సందర్శించారు. గత చంద్రబాబు అవినీతి పాలనకు, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని బుక్ లెట్ల ద్వారా స్థానికులకు వివరించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు పింఛన్లను పంపిణీ చేశారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల ముందు వరకు కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. కొత్త సంవత్సరం నుంచి ఈ పింఛన్ ను రూ. 3 వేలుకు పెంచబోతున్నట్లు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పింఛన్లపై టీడీపీకి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా..?
తెలుగుదేశం హయాంలో అందించిన పింఛన్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేసే దమ్ము పచ్చ నేతలకు ఉందా..? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పింఛన్‌ దార్లకు చుక్కలు చూపించారని ఆరోపించారు. 2014 నుంచి 2015 చివరి వరకు పాత పింఛనుదారుడు చనిపోతేనే కొత్త ఫించను మంజూరు అన్న విధానాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే టీడీపీ నాయకులు, సానుభూతిపరులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వసూళ్లకు తెర తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే రాష్ట్రంలో 43.11 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా.. 2014 సెప్టెంబరు, అక్టోబరు నెలలో నిర్వహించిన జన్మభూమి కమిటీల తనిఖీలతో కోతలు విధించి 39 లక్షలకు కుదించింది నిజం కాదా..? సమాధానం చెప్పాలన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో 65.33 లక్షల మందికి ప్రతినెలా రూ. 1,800 కోట్లు అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను 26,419 కి పెంచి ప్రతినెలా రూ.7.39 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ కు ధీటుగా రాలేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, శర్మ, తోపుల వరలక్ష్మి, శోభన్, నేరెళ్ల శివ, మహేశ్వరి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *