-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో 47 బెంచ్ లు నిర్వహణ
-1 నెల రోజుల ముందు నుంచే కేసుల పరిష్కారం కోసం చర్యలు
-ఈరోజు కేసులు పరిష్కారం రూ….. కోట్ల లకు అవార్డ్ జారీ
-జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేటట్లు సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, తదితరుల భాగస్వామ్యం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి శ్రీమతి గంధం సునీత అన్నారు.
శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు డి ఎల్ ఎస్ ఎ అధ్యక్షురాలు జడ్జి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనలు మేరకు రాజీ మార్గం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న 64 కోర్టుల యందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగు తోందని అన్నారు.
గౌరవ సుప్రీం కోర్టు వారి ఉత్తర్వులు, గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానం లో లోక్ అదాలత్ నిర్వహించి కక్షి దారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్ లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆమేరకు ముందుగా సమావేశం నిర్వహించి ఇరుపక్షాలను రాజీ చేయడం ద్వారా ఈరోజు ఆమేరకు అవార్డు జారీ చేశామన్నారు.
అన్ని రకాలైన రాజీ పడతగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డ్ ఇవ్వడం జరిగిందన్నారు . కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోడల్ చెక్కు పంపిణీ చేస్తామని ముందుకు రావడం అభినందనీయం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చెయ్యడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందు వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ లకు కూడా ఎంతో మేలు జరిగే అంశం అని గంధం సునీత పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం లో సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈరోజు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి ఆమేరకు అవార్డ్ ను ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది 4 సార్లు జాతీయ లోక్ అదాలత్, 3 సార్లు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల పరిష్కారం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని వారు పేర్కొన్నారు.
పరిష్కారం చూపిన కొన్ని తీర్పులు,:
మోటారు వాహనాల కేసులకు సంబంధించి ఎంవిఒపి నెం. 549/2022 కేసులో పిటీషనర్ జుత్తుక బాలక్రిష్ణ మరియు ఇద్దరికి నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 50 లక్షల పరిహారం, ఎంవిఒపి నెం. 362/2021 కేసులో పిటీషనర్ దుళ్ళ రాజ్ కుమార్ మరియు ఇద్దరికి చోల మండళం జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రు.38 లక్షలు, ఎంవిఒపి నెం. 674/2022 కేసులో పిటీషనర్ ఎద్దాడ సత్తిబాబు కి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ ద్వారా రూ. 10 లక్షల పరిహారం, ఎంవిఒపి నెం.683/2022 కేసులో పిటీషనర్ తిలపాక లక్ష్మి మరియు నలుగురికి నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 9 లక్షల 70 వేలు పరిహారం, ఎంవిఒపి నెం. 24/2023 కేసులో పిటీషనర్ తాడి శ్రీధర్ కి నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 26 లక్షల పరిహారం అందించడం జరిగింది.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో 1 వ అదనపు జిల్లా జడ్జి శ్రీ పి. ఆర్. రాజీవ్, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. ప్రత్యూష కుమారి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గేదెల వెంకటేశ్వరరావు, ఇతర న్యాయ మూర్తులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.