రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం” పేరుతో పాన్- ఇండియా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె. ప్రత్యూష కుమారి ఆదివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగార మరియు మహిళా కారాగారాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జైళ్లలో ఉన్న చట్టంతో విభేదించబడిన బాలురు మరియు బాలికలను గుర్తించి, న్యాయస్థానాల ముందు వారి బాల్యత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన చట్టపరమైన సహాయాన్ని అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జనవరి 25, 2024 నుండి ఫిబ్రవరి 27, 2024 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు.నేరం జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్న వారు ప్రస్తుతం జైలులో ఉన్న వ్యక్తులను గుర్తించి తగిన న్యాయస్థానం ముందు బాల్యత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన దరఖాస్తులను దాఖలు చేయడంలో మరియు గుర్తించబడిన కేసులలో వారిని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లకు బదిలీ చేయడంలో వారికి ఈ ప్రచారం సహాయం చేస్తుందని తెలియజేశారు.అర్హులైనవారు న్యాయ సేవాధికార సంస్థచే నియమించబడిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ మరియు కారాగార పారా లీగల్ వాలంటీర్స్ ద్వారా దరఖాస్తు చేసుకుని తగిన న్యాయ సహాయం పొందవల్సిందిగా తెలిపారు.ఏ విధమైన న్యాయ సమస్యలు ఉన్నా వారి ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు. వివిద చట్టాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో శిక్షలు తీవ్రంగా ఉంటాయని, బెయిల్ లభించడం కూడా కష్టమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల దుష్ప్రభావాల గురించి వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పరివర్తన చెంది గౌరవంగా జీవించాలన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …