Breaking News

రైతు సేవతో పాటు సామాజిక సేవ అభినందనీయం

-రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం 65 సంవత్సరాల వేడుకలు ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జి. శేఖర్ బాబు
-రక్తదానం చేసిన ఉద్యోగులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ధాన్యాగారంగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయదారులకు అమూల్యమైన సేవలు అందిస్తున్న వ్యవసాయ శాఖ సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావటం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం ప్రారంభించి 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వెంకటేశ్వర నగర్ కాలనీలోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంలో శాఖ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మన వ్యవసాయదారులను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్న వ్యవసాయ శాఖ ఉద్యోగులు సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు ఉద్యోగుల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా అధిక దిగుబడి, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అత్యాధునిక యంత్ర సామాగ్రి వంటి అంశాలలో రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రధానంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు అండగా నిలిచి నష్ట పరిహారం అంచనాలో సైతం మానవతా దృక్పథంతో స్పందించి గ్రామీణ ప్రాంత రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో శాఖ ఉద్యోగులు సేవా భావంతో వ్యవహరించారన్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, కలుపు మొక్కల తొలగింపు, ఎరువుల వాడకం, రైతులకు అవసరమైన రవాణా వాహనాల ఏర్పాటు వంటి కీలక విషయాలలో శాఖ అధికారులు తీసుకున్న చర్యల వల్ల గ్రామాల్లో రైతులు అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. 65 ఏళ్ల క్రితం ప్రారంభమైన వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం భవిష్యత్తులో శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మరింత విస్తృతంగా సేవలందించాలని కోరుతున్నానన్నారు. మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు శాఖ ఉద్యోగులు ప్రతిజ్ఞబూనాలన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ జి శేఖర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు విస్తృతస్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆరున్నర దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఒక సంఘం ఇప్పటికీ అదే ఉత్తేజంతో కొనసాగడం ఇతర ఉద్యోగ సంఘాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతుల అవసరాలను గురైరిగి అవకాశం ఉన్నంత మేరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఒక ఆలోచన చేయాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు బాధ్యతలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఆశించిన మేరకు వ్యవసాయ శాఖలో లక్ష్యాలను సాధించేందుకు ఉద్యోగులు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ టి. రమణ రావు ఆధ్వర్యంలో ఉద్యోగం నుంచి రక్త సేకరణ జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల భాస్కర్, కార్యదర్శి డి. ప్రవీణ్ కుమార్, మురళి కిషోర్, సంఘ సలహాదారులు డాక్టర్ ఎస్. వేణుగోపాలరావు, పి. పాపిరెడ్డి, సంఘ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎల్. కైలాష్ నాధ్ రెడ్డి, డాక్టర్ టి. వాణీ ప్రసాద రావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ కమలాకర్ శర్మ, మాజీ కోశాధికారి డాక్టర్ ఐజుద్దీన్ అహ్మద్ తదితరులతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆయా జిల్లాల సంఘ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *