-పూలే, అంబేద్కర్, గాంధీ చెప్పినట్లు…..గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాధిస్తున్నారు-ఎమ్మెల్యే కొడాలి నాని
-మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ సేవలు నేరుగా అందుతున్నాయి…
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలో 40 లక్షల నిదులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం -1 భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత ప్రజా ప్రతినిధులు, వైసిపి నేతలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు,శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం లో మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజలకు మేలు చేసే సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు.శంఖారావం అంటూ కామెడీ షో చేస్తున్న లోకేష్,తండ్రి దగ్గర నేర్చుకున్న అబద్దాలను కూడా సరిగ్గా ప్రజల ముందు చెప్పలేకపోతున్నాడని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి కు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప, ప్రజల మంచి పట్టదన్నారు. తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించిన సరే రానున్న ఎన్నికల్లో cm జగన్ గెలుపును ఎవరు ఆపలేరని ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ సాయన రవి,ఎంపీటీసీలు సీరం రాధాకృష్ణ వేణి, పెనుమాల పూర్ణ కవిత,జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, మండల అధ్యక్షుడు గుదే రవి,మండల బూత్ కమిటీ కన్వీనర్ కోటప్రోలు నాగు ,మండల సచివాలయాల కన్వీనర్ కొత్తూరి లక్ష్మీనారాయణ , వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షుడు పెన్నేరు ప్రభాకర్ రావు,వైసిపి నాయకులు పాలేటి చంటి, కనుమూరి రామిరెడ్డి,మహా రెడ్డి మురళి, పెనుమాల రంగారావు, కొడాలి సుధాకర్, కొమ్మనబోయిన రవిశంకర్, కుంచపర్తి సాయి,నందీశ్వర రావు,మేకల అనిల్ , కుందేటి ఫణి, గుడివాడ గుప్తా, దోమతోటి గోపి, గుడివాడ వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.