కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
కోరుకొండ మండలం లో 46 జగనన్న పాల సేకరణ కేంద్రాలను జంభుపట్నంలో బల్క్ మిల్క్ యూనిట్ కు అనుసంధానం గా చెయ్యడం జరుగుతోందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. శనివారం కోరుకొండ మండలం జంభుపట్నంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ మిల్క్ యూనిట్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ , జంభూపట్నం గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ యూనిట్ భవనం పనులు పూర్తి చెయ్యడం జరిగిందనీ, విద్యుత్ కనెక్షన్లు వెంటనే ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. జంబు పట్నం బల్క్ మిల్క్ యూనిట్ కేంద్రానికి 46 జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రాలు ద్వారా ప్రతి రోజూ 160 లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఐదు వేల లీటర్ల పాలు శీతలీకరణ చేసేందుకు ఈ బల్క్ మిల్క్ యూనిట్ సామర్థ్యం కలిగి ఉంటుందనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కి చెంది రూ.10 లక్షల తో యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. మార్చి ఒకటీ నుంచి పాల సేకరణ ప్రక్రియ ప్రారంభించ నున్న దృష్ట్యా పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధక అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్, జిల్లా సహకార అధికారి వై. ఉమా మహేశ్వర రావు, డి ఆర్ డీ ఎ ప్రాజెక్ట్ అధికారి ఎన్ వి వి యస్ మూర్తి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Tags Kōrukoṇḍa
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …