-లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫిబ్రవరి 29 తో ముగుస్తున్న గడువు
-జీవన్ ప్రమాణ పోర్టల్ లో నమోదు చేయవచ్చు
– డి టి వో సత్యనారాయణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పదవి విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న జీవిత భాగస్వాములు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు చివరి తేది ఫిబ్రవరి 29 అని జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలియ జేసారు. ప్రతీ సంవత్సరం సమర్పిస్తున్న తమ తమ లైఫ్ సర్టిఫికెట్స్ జనవరి, ఫిబ్రవరి నెలలలో సమర్పించవలసి ఉంటుందనీ తెలియ చేశారు. ఆ క్రమంలో ఈ నెల 29 వ తేదీ తో గడువు ముగుస్తున్నందున ఇంకా సమర్పించని పింఛను దార్లు త్వరగా ఆయా ట్రెజరి కార్యాలయాల్లో లైఫ్ సర్టిఫికేట్ లని సమర్పించ వలసినదిగా కోరియున్నారు. కావున ప్రభుత్వ పింఛను దార్లు అందరూ రాబోయే మూడు రోజులలో విధి గా వార్షిక ధృవీకరణ లైఫ్ సర్టిఫికెట్స్ ను ఆయా ట్రెజరి కార్యాలయాల్లో నమోదు చేయవలసింది గా కోరుచున్నాము. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జీవన్ ప్రమాన్ పోర్టల్ లో ఈ సేవా కేంద్రాలలో ఆధార్ కార్డు వివరాలతో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవొచ్చు నని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News