-పరీక్షా కేంద్రానికి ఉ.10.15 గం.ల తరువాత వచ్చిన అభ్యర్థులు అనుమతించబడరు
-అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
-సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 25వ తేదీన (నేడు) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష కోసం జిల్లాలో కట్టు దిట్టమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 న (నేడు) ఆదివారం ఉ. 10:30 గంటల నుంచి మ. 01:00 గంట వరకు పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు ఉదయం 09:30 గంటల నుంచి 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని,పరీక్షా కేంద్రానికి ఉ.10.15 గం.ల తరువాత వచ్చిన అభ్యర్థులు అనుమతించబడరని తెలిపారు. గ్రూప్- 2 పరీక్షల నిర్వహణ కు జిల్లా లో 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 27,894 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 31 మంది రూట్ ఆఫీసర్లు, 61 మంది లైజన్ ఆఫీసర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పరీక్షా హాలు లోకి మొబైలు ఫోన్ లు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, మొదలైనవి) తీసుకు రావాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు కల్పించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపిపిఎస్సి గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ డెస్క్ నెంబర్ 9000665565, 9676928804 ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని, పరీక్ష మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఆర్ఎస్ మెడికల్ కిట్ తో పాటు ఒక ఏఎన్ఎం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.