తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయం నుండి శుక్రవారం పెండింగ్ ఫామ్ ల పురోగతి, తొలగింపులు, ఎపిక్ కార్డుల ముద్రణ మరియు పంపిణీ స్థితి, శిక్షణా కార్యక్రమాలు, ఫిర్యాదులు & ప్రతికూల వార్తలు, డిఈఎంపి, జిల్లా కంట్రోల్ రూమ్/సోషల్ మీడియా సెల్ ఏర్పాటు, ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ/ నివేదిక నిర్వహణ వ్యవస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నుండి జిల్లా నోడల్ అధికారుల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.
తిరుపతి కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ జెసి శుభం బన్సల్, తిరుపతి ఈఆర్ఓ అదితి సింగ్ తదితరులతో కలిసి హాజరై రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత పై చేపడుతున్న చర్యలపై వివరించారు.
విసి అనంతరం కలెక్టర్ ఈఆర్ఓ లకు పలు సూచనలు చేస్తూ మాట్లాడుతూ బిఎల్వో లకు ఈవీఎం ట్రైనింగ్, ఎంసిసి తదితర ట్రైనింగ్ లు షెడ్యుల్ మేరకు పూర్తి కావాలి అని అన్నారు. పెండింగ్ క్లెయిమ్ లపై త్వరిత గతిన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మార్చి 5 నాటికి కనీస వసతులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి నివేదిక పంపాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈఆర్ఓ లు కిరణ్ కుమార్, నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, చంద్రముని, రామ్మోహన్, కోదండ రామిరెడ్డి కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News