Breaking News

అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలి.

-జిల్లాస్థాయి స్పందనలో 108 ఆర్జీలు నమోదు.
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావులు ఆర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వినతులను స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్న ఆర్జీలను అలసత్వం లేకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను రీఓపెన్ కాకుండా ఉండాలన్నారు. స్థానికంగా ప్రాధమిక స్థాయిలోనే అర్జీలకు పరిష్కారం చూపినట్లైతే జిల్లా స్థాయి స్పందనకు అర్జీదారులు వచ్చే అవకాశం ఉండదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వినతులను సమర్పించుకుంటారన్నారు. వారు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనతో పాటు ఆన్లైన్ ద్వారా జగనన్నకు చెబుదాం పోర్టలో నమోదు అవుతున్న ఆర్జీలను కూడా అధికారులు ఎప్పటికప్పడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్జీదారుల వినతులను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
నేటి స్పందనలో 108 అర్జీలు నమోదు కాగా వీటిలో రెవిన్యూ – 51, పోలీస్ -15, యంఏయుడి – 5, సర్వే అండ్ సెటిల్మెంట్ – 3, మార్కెటింగ్ – 4, కోపరేటివ్ – 1, డీఆర్డీఏ – 4, స్టాంప్స్ అండ్ రెజిస్ట్రేషన్స్ – 3, ఉపాధి కల్పన -1, ఆరోగ్య శాఖ – 2, అటవీ శాఖ – 3, విద్య – 4, విభిన్న ప్రతిభావంతులు – 2, ఆర్ అండ్ బి – 1, డ్వామా – 2, దేవాదాయ శాఖ – 1, పౌర సరఫరాలు – 3, బ్యాంకు రిలేటెడ్ – 3 ఉన్నాయన్నారు. స్పందన కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, హౌసింగ్ పీడీ రజిని కుమారి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *